వెనెజులాను ఆక్రమించలేదు : అమెరికా రాయబారి

by Muthe.Rajitha |

వెనెజులా వ్యవహారంపై UN సెక్యూరిటీ కౌన్సిల్ లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ కీలక ప్రకటన చేశారు.

వెనెజులాను ఆక్రమించలేదు : అమెరికా రాయబారి
X

దిశ, వెబ్ డెస్క్ : వెనెజులా వ్యవహారంపై జనవరి 5న న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN సెక్యూరిటీ కౌన్సిల్) అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ కీలక ప్రకటన చేశారు. అమెరికా వెనెజులాను ఆక్రమించలేదని, ఆ దేశ ప్రజలపై యుద్ధం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం చట్ట పరమైన చర్య మాత్రమేనని అన్నారు. నార్కో-టెర్రరిజం ఆరోపణలు ఎదుర్కొంటున్న వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అరెస్టు చేయడానికే ఈ ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు.

అయితే జనవరి 3న కారకాస్‌లో అమెరికా ప్రత్యేక దళాలు దాడి చేసి మదురో దంపతులను అరెస్టు చేసి న్యూయార్క్‌కు తీసుకురావడాన్ని రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మాత్రం స్వీయ రక్షణ హక్కు పేరుతో ఈ చర్య తీసుకున్నామని చెప్పినా, సమావేశంలో మిగతా సభ్య దేశాలు ఎక్కువగా అమెరికా చర్యను తప్పుబట్టాయి.

Next Story