- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా.. చర్చలకు ముందే ఆస్తుల విడుదల!
ఇరాన్ పెట్టిన షరతులకు అగ్రదేశం అమెరికా ఒప్పుకుంది. లెబనాన్ సీజ్‌ఫైర్, ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదలపై ఏకాభిప్రాయం కుదిరింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ (Iran) పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా (America) సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన డిమాండ్లకు అమెరికా అంగీకారం తెలిపినట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాలు వెల్లడించాయి. లెబనాన్ (Lebanon) సరిహద్దుల్లో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, ఉద్రిక్తతలను తగ్గించడం, అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా ఆంక్షల కారణంగా ఫ్రీజ్ (Freeze) అయిన ఇరాన్ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని అమెరికా ఎదుట ప్రతిపాదనలు పెట్టారు. అయితే, ఈ రెండు కండీషన్లకు అమెరికా అంగీకరించడం పశ్చిమాసియాలో రాజకీయాల్లో ఒక భారీ మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఇరాన్ ఆస్తుల విడుదల ద్వారా ఆ దేశానికి ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. అదే సమయంలో లెబనాన్‌లో సీజ్‌ఫైర్ కుదరడం ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోవడానికి దోహదపడనుంది.
పాకిస్థాన్‌లో ఇరాన్ బృందం హల్‌చల్..
ఓ వైపు అమెరికాతో దౌత్యం నడుపుతూనే, ఇరాన్ తన పొరుగు దేశమైన పాకిస్థాన్ (Pakistan)తో వ్యూహాత్మక చర్చలు జరుపుతోంది. శుక్రవారం అర్థరాత్రి అర్ధరాత్రి ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో సమావేశమైంది. ప్రాంతీయ భద్రత, సరిహద్దుల్లో ఉగ్రవాద నియంత్రణపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అయితే, మరికాసేపట్లో ఇరాన్ బృందం పాకిస్థాన్ ప్రధానితో భేటీ కానుంది. అమెరికాతో జరగబోయే చర్చల నేపథ్యంలో పాక్ మధ్యవర్తిత్వం, మద్దతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.






