- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉర్జిత్ పటేల్.. అధికారిక ఉత్తర్వులు జారీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా ఎన్నికయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ (Dr. Urjit Patel) IMF (అంతర్జాతీయ ద్రవ్య నిధి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నట్లుగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కెన్యాలో జన్మించిన భారతీయ ఆర్థిక వేత్త ఉర్జిత్ పటేల్, మూడు దశాబ్దాల క్రితం తన వృత్తిని ప్రారంభించిన మాతృ సంస్థకే తిరిగి వెళ్లిపోయారు. ఆయన ఐఎంఎఫ్‌లో ఐదేళ్ల పాటు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.
మొదట వాషింగ్టన్ డీసీలో, ఆ తర్వాత 1992లో న్యూఢిల్లీలోని ఐఎంఎఫ్ డిప్యూటీ రెసిడెంట్ రిప్రెజెంటేటివ్‌గా భారత్‌కు వచ్చారు. కాగా, ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణమూర్తి వి సుబ్రమణియం (Krishnamurthy V Subramaniam) సేవలను ఊహించని విధంగా ఏప్రిల్ 30న ఆరు నెలల ముందుగానే రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉర్జిత్ పటేల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 2016 నుంచి 2018 మధ్య కాలంలో ఉర్జిత్ పటేల్ ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.






