- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPSC: కొత్త యూపీఎస్సీ చైర్మన్ గా ప్రీతి సుదాన్
యూపీఎస్సీ కొత్త చైర్ పర్సన్ గా మాజీ ఐఏఎస్ ప్రీతి సూదన్ నియమితులయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీ కొత్త చైర్ పర్సన్ గా మాజీ ఐఏఎస్ ప్రీతి సూదన్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 ఐఏస్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రీతి సుదాన్ ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలుగా ఉన్నారు. గతంలో ఉన్న యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్న మనోజ్ సోనీ రాజీనామా చేయడంతో యూపీఎస్సీ సభ్యురాలుగా ఉన్న ప్రీతి సుదాన్ ను చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆమె ఆగస్ట్ 1 నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కాగా యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్న మనోజ్ సోనీ గత కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 2022 మే నెలలో యూపీఎస్సీ చైర్మన్ గా నియామకం అయిన 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి కాక ముందే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. యూపీఎస్సీలో నియామకాలు పారదర్శకంగా జరగడం లేదని, దివ్యాంగుల రిజర్వేషన్లు సహా పలు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో చైర్మన్ రాజీనామా చేయడం వివాదాస్పదం అయ్యింది.






