- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPSC: యూపీఎస్సీ చైర్మన్‌గా అజయ్ కుమార్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ (Ajay kumar) ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ నూతన చైర్మన్‌గా అజయ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదించినట్టు తెలిపింది. దీంతో అజయ్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. 2027 అక్టోబర్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అంతకుముందు యూపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ప్రీతి సుడాన్ పదవీకాలం ఏప్రిల్ 29న ముగిసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర తాజాగా ఆ పదవిని భర్తీ చేసింది. కాగా, అజయ్ కుమార్ 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2019 ఆగస్టు నుంచి 2022 అక్టోబర్ వరకు ఆయన రక్షణ శాఖ కార్యదర్శిగా పని చేశారు. తన పదవీ కాలంలో ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అజయ్ చేసిన సేవలకు గాను పలు అవార్డులు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక పదవిని అప్పగించింది.






