యూపీఐ ఆల్ టైమ్ రికార్డ్.. ఒక్కరోజులోనే అత్యధిక లావాదేవీలు

by Naga Rani Yarlagadda |

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ఆల్ టైమ్ రికార్డు సాధించింది.

యూపీఐ ఆల్ టైమ్ రికార్డ్.. ఒక్కరోజులోనే అత్యధిక లావాదేవీలు
X

దిశ, వెబ్‌డెస్క్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ఆగస్టు 2న ఒక్కరోజే ఏకంగా 70 కోట్ల లావాదేవీలు జరిపి సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఇది భారత్ లో యూపీఐ వినియోగానికి ఉన్న ప్రాముఖ్యతను చూపడంతో పాటు.. రియల్ టైమ్ చెల్లింపుల రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టింది. కొన్ని నెలలుగా దేశంలో యూపీఐ వినియోగం శరవేగంగా పెరుగుతుండగా.. జూన్ లో రోజుకు సుమారుగా 62.8 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. జులై నెలమొత్తంలో 1947 కోట్ల లావాదేవీలు జరగ్గా వాటి విలువ రూ.25.1 లక్షల కోట్లుగా నమోదయింది. మున్ముందు రోజుకు 100 కోట్ల లావాదేవీలను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూపీఐ నిర్వహక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పేర్కొంది.

Next Story