- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HUSBAND MURDER : భర్తను సజీవదహనం చేసిన భార్య.. పెట్రోల్ పోసి నిప్పంటించి.. ప్రియుడితో..
ఉత్తరప్రదేశ్ బాగ్‌నత్‌లో దారుణం చోటు చేసుకుంది. సన్నీ అనే వ్యక్తిని సజీవ దహనం చేసింది భార్య అంకిత. ప్రియుడు డాక్టర్ అయ్యూబ్ అహ్మద్, అంకిత మామ సుశీల్, బేబీ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టగా కేసు నమోదైంది. కందేరా గ్రామానికి చెందిన సన్నీ గర్హీ.. కంగరాన్ గ్రామానికి

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బాగ్‌నత్‌లో దారుణం చోటు చేసుకుంది. సన్నీ అనే వ్యక్తిని సజీవ దహనం చేసింది భార్య అంకిత. ప్రియుడు డాక్టర్ అయ్యూబ్ అహ్మద్, అంకిత మామ సుశీల్, బేబీ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టగా కేసు నమోదైంది. కందేరా గ్రామానికి చెందిన సన్నీ గర్హీ.. కంగరాన్ గ్రామానికి చెందిన అంకితను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. జూలై 22న.. కావడీ యాత్రలో భాగంగా గంగా జలం తీసుకునేందుకు హరిద్వార్‌కు బైక్‌పై వెళ్లాడు సన్నీ. అయితే కంగరాన్ గ్రామ రోడ్డు సమీపంలో నలుగురు వ్యక్తులు అతన్ని అడ్డగించారు. కొట్టి.. అంకిత తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సన్నీపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. తీవ్రంగా గాయపడిన సన్నీని మొదట మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బాధితుడి తండ్రి వేద్‌పాల్ ఫిర్యాదు ఆధారంగా అంకిత, డాక్టర్ అయ్యూబ్, సుశీల్, బేబీలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని.. గ్రామస్థులు ఆందోళనకు దిగారు.






