- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో దారుణం జరిగింది. 11 ఏళ్ల బధిర బాలికపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎన్ కౌంటర్ ద్వారా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. యూపీలోని రాంపుర్‌లో ఈ ఘటన జరిగింది. 11 ఏళ్ల బాలిక కన్పించడం లేదని బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె కోసం కుటుంబసభ్యులు గాలిస్తుండగా.. స్థానికంగా ఉన్న పొలాల్లో తీవ్ర గాయాలతో, నగ్నంగా చిన్నారి కన్పించింది. వెంటనే బాలికను కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఈక్రమంలో డాన్ సింగ్ (24) అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించగా, అతడు పోలీసుల పైకి కాల్పులు జరిపాడు. ఎన్ కౌంటర్ లో నిందితుడి కాలుకి గాయమయినట్లు తెలిపారు.
సామూహిక అత్యాచారం..
ఇక, ఆ చిన్నారికి మెడికల్ టెస్టులు నిర్వహించిన డాక్టర్ కీలక విషయాలు వెల్లడించారు. ఒకరు కంటే ఎక్కువమంది బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. చిన్నారి ముఖంపై బలమైన గాయాలైనట్లు వెల్లడించారు. ఆమె ప్రైవేటు భాగాల పైనా అనేక గాయాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా. తాము చూసిన అత్యంత ఘోరమైన లైంగిక నేరాల్లో ఇది ఒకటన్నారు.






