బరితెగించిన వైద్యుడు.. వాట్సాప్‌ స్టేటస్‌లో యువతి మార్ఫింగ్ ఫొటోలు.. భరించలేక..

by Sujitha Rachapalli |

వైద్యుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య మార్ఫింగ్ ఫొటోలతో కొన్నాళ్లుగా వేధింపులు స్టేటస్ కూడా పెట్టడంతో సంచలన నిర్ణయం తీసుకున్న యువతి

బరితెగించిన వైద్యుడు.. వాట్సాప్‌ స్టేటస్‌లో యువతి మార్ఫింగ్ ఫొటోలు.. భరించలేక..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా క్లినిక్ నడుపుతున్న నరేంద్ర రాజ్‌పుత్ ముస్లిం యువతిని హరాజ్ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అమ్మాయి ట్రీట్మెంట్ కోసం క్లినిక్‌కు వెళ్లగా.. అప్పటి నుంచి మెసేజ్‌లు చేయడం.. వేధించడం మొదలుపెట్టాడు. ఆ రోజు తన ఫొటో తీశాడో లేదంటే తన ఫేస్ బుక్ నుంచి ఫొటో చోరీ చేశాడో తెలియదు కానీ.. ఆమె ఫొటోను తన పక్కన పెట్టి మార్ఫింగ్ చేశాడు. ఇద్దరు కలిసి ఉన్నట్లుగా ఉన్న ఈ ఫిక్‌ను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. దీంతో ఈ ఫొటోలు చూసిన అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Next Story