ఆశలు వదులుకోండి.. బాబ్రీ మసీదు పునర్‌:నిర్మాణం సాధ్యం కాదు: UP CM

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-10 10:47:10  IST  )

బాబ్రీ మసీదు పునర్:నిర్మాణంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆశలు వదులుకోండి.. బాబ్రీ మసీదు పునర్‌:నిర్మాణం సాధ్యం కాదు: UP CM
X

దిశ, వెబ్‌డెస్క్: బాబ్రీ మసీదు పునర్:నిర్మాణం(Babri Masjid Reconstruction)పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు పునర్:నిర్మాణం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ నిర్మాణానికి ఎవరైనా ప్రయత్నించినా కూడా అడ్డుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఆ సాహసం చేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, కూల్చివేసిన బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయంగా అయోధ్యలోని ధన్నిపూర్‌లో 5 ఎకరాల స్థలంలో కొత్త మసీదు నిర్మాణం (మస్జిద్-ఎ-అయోధ్య) ప్రతిపాదించబడింది. దీని నిర్మాణం సవరించిన ప్లాన్లతో ఏప్రిల్ 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అప్పటి అధికారులు అంచనా వేశారు. ఈ కాంప్లెక్స్‌లో మసీదుతో పాటు ఆసుపత్రి, లైబ్రరీ మరియు మ్యూజియం కూడా నిర్మించాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా బాబ్రీ మసీదు నిర్మాణం సాధ్యం కాదని యూపీ సీఎం యోగి స్పష్టం చేయడంతో మస్లింలంతా ఆందోళన చెందుతున్నారు.

Next Story