UP: యూపీలో పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఇద్దరి అరెస్ట్

by S Gopi |   (  Updated:2025-05-23 15:55:12  IST  )

అక్రమ వీసా, సున్నితమైన జాతీయ భద్రతా సమాచారాన్ని చేరవేయడం, పాకిస్తాన్‌ భావజాలాన్ని పెంచుతున్నట్టు వీరిపై సందేహాలున్నాయి.

UP: యూపీలో పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఇద్దరి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ-టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) ఇద్దరిని అరెస్ట్ చేసింది. అక్రమ వీసా, సున్నితమైన జాతీయ భద్రతా సమాచారాన్ని చేరవేయడం, పాకిస్తాన్‌తో సంబంధాలున్న భావజాలాన్ని పెంచుతున్నట్టు వీరిపై సందేహాలున్నాయి. వారిలో ఢిల్లీకి చెందిన మొహమ్మద్ హరూన్ సీలంపూర్‌లో స్క్రాప్ డీలర్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న ముజమ్మల్‌ హుస్సేన్‌తో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. మొహమ్మద్ హరూన్‌కు పాకిస్తాన్‌లో బంధువులు ఉండటం, అందుకోసం ముజమ్మిల్ వీసా ఇప్పించినట్టు సమాచారం. అలాగే పాకి వీసాలు ఇప్పించే నెపంతో హరూన్ చాలామంది నుంచి డబ్బు వసూలు చేశాడని, అందులో కొంత ముజమ్మిల్ కోసం ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్టు అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే హరూన్ అతనికి సున్నితమైన సమాచారం చేరవేసి ఉండొచ్చనే అనుమానిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముజమ్మిల్‌ను అనుమానిత వ్యక్తిగా ప్రకటిస్తూ, స్వదేశానికి పంపింది. మరోవైపు వారణాసి, ఆదంపూర్‌లో జరిగిన ఆపరేషన్ సందర్భంగా తుఫెల్ అనే మరో వ్యక్తిని ఏటీఎస్ బృందం అదుపులోకి తీసుకుంది. అతను పాకిస్తాన్ కేంద్రంగా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నట్టు తెలిసింది. పాక్‌లో నిషేధించిన తెహ్రీక్ ఎ లబెక్ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా రిజ్వీ వీడియోలను షేర్ చేస్తున్నట్టు, భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు అందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుందా వారణాసిలోని జ్ఞానవాపి, రైల్వే స్టేషన్, జామా మసీద్, రాజ్‌ఘాట్, ఎర్రకోట, నిజాముద్దీన్ ఫోటోలను తుఫెల్ షేర్ చేశాడని ఏటీఎస్ వెల్లడించింది.

Next Story