- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోయిడాలో ఆగని నిరసన జ్వాలలు..రెండో రోజూ రాళ్ల దాడి
నోయిడాలో జీతాల పెంపు కోసం కొనసాగుతున్న నిరసనలు! రెండో రోజు పోలీసులపై రాళ్ల దాడి. భారీగా పోలీసుల మోహరింపు.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని ఫేజ్-2 ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జీతాల పెంపు డిమాండ్‌తో నిన్న హింసాత్మక నిరసనలకు దిగిన ఆందోళనకారులు, ఈరోజు కూడా భారీగా గుమిగూడారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపైకి, పరిసర ప్రాంతాలపైకి రాళ్లు రువ్వడం తో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు భీష్మించుకోవడంతో నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో ఆందోళన నెలకొంది.
నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నం
పరిస్థితి విషమిస్తుండటంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఫేజ్-2లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆందోళనకారులను ఘటనా స్థలం నుంచి వెళ్లగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






