- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UNSC: ఐరాసలో పాక్‌ను నిలదీయనున్న భారత్.. పక్కా ఆధారాలతో ప్లాన్ !
పాకిస్థాన్‌కు భారత్ మరో భారీ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదం విషయంలో పాక్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌కు (Pakisthan) భారత్ మరో భారీ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదం విషయంలో పాక్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. పాక్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్టు పక్కా ఆధారాలతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (Unsc) కి ఓ బృందాన్ని పంపనున్నట్టు సమాచారం. పహెల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తూ యూఎన్ఎస్సీ 1267 ఆంక్షల కమిటీని సంప్రదించనుంది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ సైతం ఇప్పటికే సేకరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. టీఆర్ఎఫ్‌ను పాక్ రక్షిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని యూఎన్ఎస్సీ ఎదుట లేవనెత్తనుంది.
కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1267 ఆంక్షల కమిటీని 1999లో స్థాపించారు. దీనిని దాయిష్, ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ అని కూడా పిలుస్తారు. ఇది ఉగ్రవాద నిర్మూలనకు, ఐసిస్, అల్-ఖైదా వంటి ఉగ్ర సంస్థలతో సంబంధమున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించే వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ వచ్చే వారం సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ మీటింగ్‌లోనే పాక్‌ను ఎండగట్టాలని భారత్ భావిస్తోంది.






