- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ - పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు.. ఐరాస ఆందోళన
భారత్ - పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి (United Nations) భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. సౌత్ ఆసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు సమావేశం నిర్వహించే వీలుంటుందని భద్రతా మండలి అధ్యక్షుడు ఇవాంజెలోస్ సెకెరిస్ తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై కొన్ని ఆంక్షలు విధించడంతో పాటు.. సింధునదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వం సైతం భారత్ పై కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణానైనా యుద్ధం జరగవచ్చని ఇటు భారత్ లో, అటు పాక్ లో హెచ్చరికలు జారీ అవ్వడంతో హై అలర్ట్ ప్రకటించారు. తాజాగా భారత్ - పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి (United Nations) భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది.
సౌత్ ఆసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు సమావేశం నిర్వహించే వీలుంటుందని భద్రతా మండలి అధ్యక్షుడు ఇవాంజెలోస్ సెకెరిస్ తెలిపారు. సభ్యదేశాలు అభ్యర్థిస్తే భారత్ - పాక్ దేశాల మధ్య నెలకొన్ని పరిస్థితులపై చర్చించేందుకు సిద్ధమని UNSC ప్రకటించింది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు సహాయపడుతాయని ఇవాంజెలోస్ అభిప్రాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినవారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు.
కాగా.. భారత్ - పాకిస్థాన్ ల మధ్య ఉన్న ఉద్రిక్తతలకు కారణం పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం కారణమని పాక్ రాజకీయనేత మౌలానా ఫజల్-ఉర్-రెహ్మాన్ విమర్శించారు. పాకిస్థాన్ ప్రభుత్వం.. కశ్మీర్ కంటే ముందు ఆప్ఘనిస్తాన్ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఆప్ఘనిస్తాన్ భారత్ కు అనుకూలంగా ఉందని, తాలిబన్లు భారత్ కే మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. యుద్ధం చేయాలన్న సైనిక ఆలోచన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.






