- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రకోట సమీపంలో పేలుళ్లపై ఐరాస కీలక నివేదిక.. బయటపడిన పాక్ వక్రబుద్ధి?
దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో గతేడాది జరిగిన టెర్రర్ అటాక్ పై ఐక్యరాజ్యసమితి కీలక నివేదిక విడుదల చేసింది. ఐరాస భద్రతా మండలికి సమర్పించిన నివేదికలో పలు విషయాలను పేర్కొంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో గతేడాది జరిగిన టెర్రర్ అటాక్ పై ఐక్యరాజ్యసమితి కీలక నివేదిక విడుదల చేసింది. ఐరాస భద్రతా మండలికి సమర్పించిన నివేదికలో ఈ దాడికి.. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహమ్మద్ ఉగ్రమూకతో సంబంధం ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. పాకిస్థాన్లో ఆర్థికపరమైన ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నా.. జైషేతోపాటు పలు ఉగ్రమూకలు సౌత్ ఏషియాలో క్రియాశీలకంగా పావులు కదుపుతున్నాయని కూడా తెలిపింది. జైషే ముఠా పలు ఉగ్రదాడులకు పాల్పడినట్లు అనుమానించిన ఐరాస.. వాటిలో గతేడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన దాడి కూడా ఒకటి అని ఆరోపించింది. జమాత్ ఉల్ ముమినత్ పేరుతో ఒక మహిళా వింగ్ ను కూడా ఏర్పాటు చేసుకుందని, ఇది ఆందోళనకర పరిణామంగా పేర్కొంది. జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి ఘటనను కూడా ఈ నివేదికలో ప్రస్తావించింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు హతమైనట్లు కూడా తెలిపింది. జైషే, లష్కరే తొయిబా వంటి ఉగ్రమూకలు తమ దేశంలో ఉనికిలో లేవని కొంతకాలంగా పాకిస్థాన్ వాదిస్తుండగా.. తాజాగా వచ్చిన నివేదికతో పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది.






