- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవ్వాలి.. ప్రతిపక్షాలకు స్టాలిన్ పిలుపు
కేంద్రానికి వ్యతిరేకంగా ఏకమవుదాం అంటూ బీజేపీయేతర రాష్ట్రాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన లేఖను విడుదల చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రానికి వ్యతిరేకంగా ఏకమవుదాం అంటూ బీజేపీయేతర రాష్ట్రాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన లేఖను విడుదల చేశారు. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ ఏం చేయాలో చెప్పే హక్కు కోర్టుకు ఉందా అని రాష్ట్రపతి ముర్ము ఇటీవల సు ప్రీంను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు బీజేపీయేతర పార్టీలు ఏకమవ్వాలని, వెంటనే ఆయా పార్టీలు స్పందించాలని పిలుపునిచ్చారు. కేంద్రం యొక్క కుతంత్రానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని అన్నారు.
కోర్టు ముందు సమన్వయంతో కూడిన చట్టపరమైన వ్యూహాన్ని రూపొందించాలని, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని పరిరక్షించడానికి ఐక్యతను ప్రదర్శించాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే తమిళనాడు గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదంలో కొన్ని నెలల క్రితం సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. బిల్లుల విషయంలో గవర్నర్ తో పాటూ రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించింది. దీంతో ద్రౌపది ముర్ము సుప్రీం కోర్టుకు 14 ప్రశ్నలు వేశారు.ఈ నేపథ్యంలోనే స్టాలిన్ బీజేపీయేతర రాష్ట్రాలు ఏకమవ్వాలంటూ లేఖ రాశారు.






