నుజ్జు నుజ్జైన కారు.. కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం

by Gantepaka Srikanth |

కేంద్రమంత్రి(Union Minister) శ్రీనివాస వర్మ(Srinivasa Varma)కు పెను ప్రమాదం తప్పింది.

నుజ్జు నుజ్జైన కారు.. కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి(Union Minister) శ్రీనివాస వర్మ(Srinivasa Varma)కు పెను ప్రమాదం తప్పింది. శ్రీనివాస వర్మ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ప్రయివేటు వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస వర్మకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. కేంద్రమంత్రిని హుటాహుటిన దగ్గర్లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం శ్రీనివాస వర్మ విజయవాడ(Vijayawada)కు బయల్దేరారు. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయినట్లు సమాచారం. బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ భవనం(Parliament Building) నుంచి తన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా, చికిత్స అనంతరం కేంద్రమంత్రికి వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కాగా, అంతకుముందు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన నూతన స్టీల్ సెక్టార్‌లో పరిశోధన, అభివృద్ధి, స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఆర్టీఎంఐ) వెబ్-పోర్టల్‌లో స్టీల్ కొల్లాబ్ ప్లాట్‌ ఫారాంను ఆయన ప్రారంభించారు. స్టీల్ పరిశ్రమ రంగంలో సాధించిన అభివృద్ధి గురించి చర్చించడం ఆనందంగా ఉందని మాట్లాడారు. ఉక్కు తయారీలో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి ప్రధాని మోడీ బలమైన పునాది వేశారని కొనియాడారు.

Next Story