Shivraj Singh Chouhan : పంటలకు మద్ధతు ధరపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
Shivraj Singh Chouhan : పంటలకు మద్ధతు ధరపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్‌బ్యూరో : మోడీ ప్రభుత్వం రైతులు పండించే పంటను మద్ధతు ధరకు కొనుగోలు చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో రైతులకు మద్ధతు ధర అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘రైతులు పండించే అన్ని పంటలను మద్ధతు ధరకు కొనుగోలు చేస్తాం. మోడీ ప్రభుత్వంలో మోడీ గ్యారంటీని ఖచ్చితంగా నెరవేరుస్తాం.’ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పంట ఉత్పత్తికి 50 శాతం పెట్టుబడి చెల్లించాలని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను ఒప్పుకోలేదని మండిపడ్డారు. 2019 నుంచి ప్రధాని మోడీ రైతులకు ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం ఇవ్వడం ద్వారా కనీస మద్ధతు ధరను లెక్కించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే రైతులకు లాభాలు చేకూర్చేలా పంటలకు ధరను మోడీ సర్కారు చెల్లింస్తోందన్నారు. వరి, గోధుమలు, జొన్నలు, సోయాబీన్‌లను మూడేళ్లుగా ఉత్పత్తి ధర కంటే 50 శాతం అధికంగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్‌పీపై మీ ఆలోచనలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ అడగగా.. ఎంఎస్‌పీ గురించి స్పష్టమైన ఆలోచన ఉన్నట్లు కేంద్ర మంతి తెలిపారు. ఎంఎస్‌పీని 50 శాతం కంటే ఎక్కువ లాభంతో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. రైతుల ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed