- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో కేజ్రీవాల్ ఫస్ట్: కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ పై కేంద్రమంత్రి జేపీ నడ్డా సంచలన ఆరోపణలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎన్నికలు(Delhi Elections) రాజకీయ వేడికి తెర తీశాయి. వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార ఆప్(AAP), ప్రతిపక్ష బీజేపీ(BJP) మధ్య ఎలక్షన్ వార్ నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు పార్టీ అధ్యక్షులు సైతం పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే తమ పథకాలను ఆపేస్తుందని ఢిల్లీ అంతటా తిరుగుతూ మాజీ సీఎం, ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్(Kejriwal) ప్రచారం చేస్తున్నారు. ఇందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(Jp Nadda) సైతం రంగంలోకి దిగారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆప్ నేతలు, కేజ్రీవాల్ విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పదేళ్ల పాలనలో ఆప్ ప్రభుత్వం అవినీతిలో రికార్డులను బద్ధలు కొట్టిందని జేపీ నడ్డా ఆరోపించారు. మాజీ సీఎం కేజ్రీవాల్ ఎంతో అమాయకంగా నటిస్తూ బీజేపీపై అన్ని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆ విషయంలో పోటీ పెడితే కేజ్రీవాల్ ఫస్ట్ వస్తారని ఎద్దేవా చేశారు. పదేళ్ల మోడీ పాలనలో దేశ రాజధాని ఢిల్లీ చాలా అభివృద్ధి చెందిందన్నారు. ఇతరులెవరూ ఢిల్లీని అభివృద్ధి చేయలేదని జేపీ నడ్డా విమర్శించారు.






