- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రైన్ ప్రమాద బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన రైల్వే మంత్రి
by Javid Pasha |
కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద బాధితులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ నష్టపరిహారం ప్రకటించారు.

X
దిశ, వెబ్ డెస్క్: హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స ప్రెస్ ట్రైన్ కు శుక్రవారం రాత్రి ఒడిషాలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రమాద బాధితులకు నష్టపరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మృతులకు ఒక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే 50 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. సహాయక చర్యలను అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ పర్యవేక్షించారు. ఇక ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
Next Story






