- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UNESCO జాబితాలోకి ఆ కోట.. స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో శుక్రవారం జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఫ్రాన్స్‌లోని పారిస్‌లో శుక్రవారం జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణ కోటను యునెస్కో గుర్తింపు లభించింది. ఆ కోట, సైనిక వ్యవస్థను సూచించే ‘మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్’ను నిన్న జరిగిన ప్రపంచ హెరిటేజ్ సదస్సులో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్టు UN సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఇది భారత దేశం నుంచి యునెస్కో గుర్తింపు పొందిన 44వ ప్రదేశం. 2024-25 సైకిల్‌కు ఎంట్రీగా కేంద్రం మరాఠాల 12 కోటల సముదాయాన్ని పంపింది. ఇవి మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయి. ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్‌లో మహారాష్ట్రలోని సల్హేర్ కోట, శివనేరి కోట, లోహ్‌గఢ్, ఖండేరి కోట రాజీగఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయ్ దుర్గ్, సింధుదుర్గ్, తమిళనాడులోని జింజీ కోట భాగంగా ఉన్నాయి.
అయితే.. విభిన్న భౌగోళిక, భౌతిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ భాగాలు మరాఠా పాలన వ్యూహాత్మక శక్తులను ప్రతిబింబిస్తాయని భారతీయ అధికారులు తెలిపారు. ఇక, ‘‘మరాఠీ మిలిటరీ ల్యాండ్‌స్కేప్’’లు 17-19 శతాబ్దాల మధ్య నిర్మించారు. మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ యునెస్కో గుర్తింపు పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ పొందడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. "మహారాజాధిరాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో ముడిపడి ఉన్న 12 కోటలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం దేశవాసులందరికీ ఎంతో గర్వకారణం" అని అమిత్ షా ట్టిట్టర్(X) వేదికగా పేర్కొన్నారు.






