- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం.. ఆ ఉద్యోగులకు బోనస్ ప్రకటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం (Union Cabinet meeting) ప్రారంభం అయింది. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి కీలక కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అలాగే ఈ కేబినెట్ సమావేశం (cabinet meeting)లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11.72 లక్షల రైల్వే ఉద్యోగుల (Railway employees)కు 78 రోజుల వేతనానికి సమానమైన ₹2,028.57 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (Productivity Linked Bonus) మంజూరుకు ఆమోదం తెలిపారు.
ఈ బోనస్‌ను దసరా, దుర్గాపూజా పండుగలకు ముందు ఉద్యోగులకు అందజేయాలని నిర్ణయించారు. అలాగే, రాష్ట్రాల అభ్యర్థనల మేరకు దేశంలోని మెడికల్ కళాశాలలో పీజీ సీట్ల సంఖ్యను పెంచే (Medical College PG seats Increase) ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం (Central Govt) పరిశీలిస్తోంది. ఈ నిర్ణయాలు రైల్వే ఉద్యోగుల ప్రోత్సాహానికి, మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన మార్పులను సూచిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






