Union Budget-2025: భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌజ్‌గా మారుస్తాం.. పార్లమెంట్‌లో ప్రెసిడెంట్ ముర్ము

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-31 06:27:14  IST  )

దేశంలో టాక్స్ (Tax) విధానాలను తమ ప్రభుత్వం సరళీకృతం చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) అన్నారు.

Union Budget-2025: భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌజ్‌గా మారుస్తాం.. పార్లమెంట్‌లో ప్రెసిడెంట్ ముర్ము
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో టాక్స్ (Tax) విధానాలను తమ ప్రభుత్వం సరళీకృతం చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) అన్నారు. ఇవాళ పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. భారత దేశం తరపున మహిళలు కూడా ఒలింపిక్స్ పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. దేశంలో టాక్స్ విధానాలను పూర్తిగా సరళీకృతం చేశామని తెలిపారు. దేశంలో 1.15 లక్షల మంది మహిళలను లక్‌పతీ దీదీలుగా మారారని గుర్తు చేశారు. అదేవిధంగా భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌజ్‌ (Global Innovation Power House) గా మారుస్తామని తెలిపారు.

అదే విధంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ (National Research Foundation) ను కూడా ప్రారంభించామని అన్నారు. దేశంలో టెక్నాలజీనికి కొత్త పుంతలు తొక్కించేందుకు ఇండియా AI మిషన్‌ను ప్రారంభించిందని తెలిపారు. చిన్న వ్యాపార సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటివని వారి కోసం దేశంలోని MSMEల కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ను కూడా తీసుకొచ్చామని అన్నారు. తమ ప్రభుత్వం ఇ-గవర్నెన్స్‌ (E-Governance)కు ప్రత్యేక ప్రధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. దేశీయ పౌర విమాన రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు. దేశ ఆర్థిక, సామాజిక, జాతీయ భద్రతకు డిజిటల్ మోసాలు సైబర్ క్రైమ్ (Cyber Crime), డీప్ ఫేక్ (Deep Fake) పెనుముప్పుగా మారాయని పేర్కొన్నారు. అందుకే సైబర్ సెక్యూరిటీ (Cyber ​​security)లో సమర్ధతను పెంచుతున్నామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra PradesH) రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరానికి (Polavaram) రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. అదేవిధంగా ఆ ప్రాజెక్ట్‌‌ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. దళితులు, వెనుకడిన వర్గాలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందజేస్తున్నామని.. ఆదివాసి ప్రాంతాల్లో 30 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించామని సభలో అన్నారు. ప్రజారోగ్యం కోసం 1.75 లక్షల ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పెరుగుతోన్న క్యాన్సర్ (Cancer) మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని.. పలు క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాలను పూర్తిగా తొలగించామని రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

Next Story