- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UCC: ఉత్తరాఖండ్ లో అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌర స్మృతి
ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami) యూసీసీ విధివిధానాలకు సంబంధించిన పోర్టల్ ను ప్రారంభించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami) యూసీసీ విధివిధానాలకు సంబంధించిన పోర్టల్ ను ప్రారంభించారు. యూసీసీతో పౌరులందరికీ సమాన హక్కులు ఉండేలా చూస్తామని ధామి చెప్పుకొచ్చారు. యావత్ దేశానికి ఇది చారిత్రాత్మకమైన రోజని.. దేశంలో యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్నారు. “ఉమ్మడి పౌరస్మృతి అనేది వివక్షను అంతం చేయడానికి ఒక రాజ్యాంగపరమైన చర్య. దీని ద్వారా పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే ప్రయత్నం జరుగుతోంది. దీని అమలుతో నిజమైన మహిళా సాధికారత కనిపిస్తుంది. వారి హక్కులను కాలరాసే బాల్య వివాహాలు, ట్రిపుల్ తలాక్, విడాకులు, ఆస్తుల వారసత్వం, బహుభార్యత్వం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి యూసీసీ తోడ్పడుతుంది. ఉమ్మడి పౌరస్మృతి ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదనే విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న పలు షెడ్యూల్డ్ తెగలను దీనినుంచి దూరంగా ఉంచామని.. తద్వారా ఆ తెగలు వారి హక్కులను పరిరక్షించుకోవచ్చు” అని ధామి పేర్కొన్నారు.
యూసీసీ విధానాలు ఏంటంటే?
ఉమ్మడి పౌరస్మృతితో వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. కాగా.. గోవా తర్వాత యూనిఫాం లీగర్ ఫ్రేమ్ వర్క్ ను కలిగి ఉన్న రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్‌లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు యూసీసీ దోహదం చేయనుంది. సహ జీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహజీవనం చేస్తున్నవారు ఇకపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. అంతేకాకుండా త్రివిధ దళాల్లో పనిచేస్తున్న వారికోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. దీంతో, అత్యవసరమ పరిస్థితుల్లో ఈ పద్ధతితో వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు. అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లోనూ బహుభార్యత్వాన్ని, హలాల్ విధానంపై నిషేధాన్ని విధించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో యూసీసీ అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కాగా.. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దాన్ని అమలు చేసింది.






