- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఆమోదం తెలిపిన అస్సాం అసెంబ్లీ
by Kema Shiva Kumar |
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు దిశగా అస్సాం అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు దిశగా మరో కీలక అడుగు పడింది. అస్సాం శాసనసభ (Assam Assembly) ఇవాళ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఈ చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్, గుజరాత్‌ల తర్వాత అస్సాం మూడో రాష్ట్రంగా నిలిచింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-44 ప్రకారం.. దేశంలోని పౌరులందరికీ ఒకే విధమైన పౌర చట్టాన్ని వర్తింపజేయాలనేది ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, ఆస్తి వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత విషయాలలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇకపై ఒకే చట్టం వర్తించనుంది. గతంలో ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించగా, ఇప్పుడు అస్సాం కూడా ఆ బాటలోనే పయనిస్తూ దేశంలో చర్చకు తెరలేపింది.
Next Story






