- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనిజులాను ఆక్రమించిన అమెరికా.. UN కౌన్సిల్ అత్యవసర భేటీ
అమెరికాపై ఐక్యరాజ్య సమితి కొరడా ఝుళిపిస్తుందా?

దిశ, వెబ్ డెస్క్ : వెనిజువెలా, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN సెక్యూరిటీ కౌన్సిల్) అత్యవసర సమావేశం జరగనుంది. జనవరి 3న అమెరికా సైన్యం వెనిజువెలాలో దాడులు చేసి అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అరెస్ట్ చేయడంతో ఈ సంక్షోభం మొదలైంది. దీనిని వెనిజువెలా ప్రభుత్వం "అక్రమ ఆక్రమణ", "దేశ సార్వభౌమాధికారంపై దాడి"గా తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. వెనిజులా అభ్యర్థన మేరకు కొలంబియా యూఎన్ భద్రతా మండలికి అత్యవసర సమావేశం కోసం రిక్వెస్ట్ పంపింది.
ఈ సమావేశం జనవరి 5న న్యూయార్క్‌లోని యూఎన్ హెడ్‌క్వార్టర్స్‌లో జరగనుంది. ఈ సమావేశంలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలు చట్టబద్ధమా కాదా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయా అనే అంశాలపై చర్చ జరగనుంది. అమెరికా చర్యలను ఖండించడంతో పాటు దాడులు నిలిపివేయాలని వెనిజువెలా డిమాండ్ చేయనుంది. రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు వెనిజువెలాకు మద్దతుగా నిలవనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా మాత్రం ఇది డ్రగ్ నియంత్రణ చర్యలలో భాగమని వాదిస్తోంది.
ఈ ఘటన లాటిన్ అమెరికా దేశాల్లో కూడా కలకలం రేపింది. మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలు అమెరికా చర్యలను విమర్శించాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించారు. మొత్తం మీద ఈ సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.






