రష్యాలోని న్యూక్లియర్ ప్లాంట్‌పై డ్రోన్ల దాడి!

by Phanindra |

న్యూక్లియర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేసిందని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ 34వ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఘటన జరగడం గమనార్హం.

రష్యాలోని న్యూక్లియర్ ప్లాంట్‌పై డ్రోన్ల దాడి!
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలోని కర్స్క్ ప్రాంతంలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి. ఉక్రెయిన్ 34వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ దాడుల్లో పవర్, ఎనర్జీ సదుపాయాలన ఉక్రెయిన్ టార్గెట్ చేసిందని రష్యా ఆరోపించింది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై దాడితో మంటలు అంటుకున్నాయని, అయితే వీటిని అధికారులు వెంటనే చల్లార్చారని రష్యా తెలిపింది. ఐక్యరాజ్య సమితి న్యూక్లియర్ వాచ్‌డాగ్ ఈ ఘటనపై స్పందించింది. మిలిటరీ దాడి వల్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు అంటుకున్న వార్తలు తమ దృష్టికి వచ్చాయని, అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి ధ్రువీకరణ తమకు అందలేదని తెలిపింది. ఈ దాడి గురించి ఉక్రెయిన్ కూడా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

Next Story