- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ukrein: మరోసారి అమెరికా ఉక్రెయిన్ మధ్య సమావేశం.. వారం రోజుల్లోనే జరిగే చాన్స్ !
ఇటీవల డొనాల్డ్ ట్రంపుతో జెలెన్ స్కీ సమావేశం సందర్భంగా ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు (Donald Trump) తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ (Zelensky) సమావేశం సందర్భంగా ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పలు దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి. అయితే త్వరలోనే ఉక్రెయిన్, అమెరికా మరోసారి భేటీ కానున్నట్టు జెలెన్ స్కీ తెలిపారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తదుపరి భేటీలో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. శాంతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామని చెప్పారు.
బ్రస్సెల్స్‌లో గురువారం జరిగిన యూరోపియన్ యూనియన్ అత్యవసర శిఖరాగ్ర సమావేశం అనంతరం జెలెన్ స్కీ మాట్లాడారు. యుద్ధానికి కారణం రష్యానేనని, ప్రస్తుతం ఘర్షణను ముగించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇంధనం, ఇతర పౌర మౌలిక సదుపాయాలపై దాడి చేయొద్దని రష్యాకు సూచించారు. తమకు మద్దతు తెలిపిన యూరోపియన్ యూనియన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమామావేశం సందర్భంగా జెలెన్ స్రీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.






