UK university: హైదరాబాద్ యువతితో ఎఫైర్.. యూకే యూనివర్సిటీ వీసీ సస్పెన్షన్

by B.Srinivas |

హైదరాబాద్‌కు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో బకింగ్‌హామ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ టూలీపై సస్పెన్షన్ వేటు పడింది.

UK university: హైదరాబాద్ యువతితో ఎఫైర్.. యూకే యూనివర్సిటీ వీసీ సస్పెన్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో యూకేలోని బకింగ్‌హామ్ యూనివర్సిటీ (Baking Ham University) వైస్ చాన్స్‌లర్ జేమ్స్ టూలీ (James Tooli)పై సస్పెన్షన్ వేటు పడింది. యూనివర్శిటీ ఫీజు చెల్లించడంలో వీసీ ఆమెకు సహాయం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సదరు యువతి తన డైరీలో రాసుకుంది. 65 ఏళ్ల ప్రొఫెసర్ టూలీతో తనకు లైంగిక సంబంధం ఉందని డైరీలో పేర్కొనగా ఈ కాపీలను ప్రొఫెసర్ భార్య సింథియా యూనివర్సిటీకి అందజేసింది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు టూలీని సస్పెండ్ చేశారు. టూలీ అక్టోబర్‌లోనే సస్పెండ్ కాగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని టూలీ కొట్టి పారేశారు. హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో చేపట్టిన ఓ ప్రాజెక్ట్‌లో టూలీ పాలుపంచుకున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే యువతితో సంబంధం ఏర్పడిందని, ఆమె ట్యూషన్ ఫీజుకు సహకరించారని తెలిపాయి. కాగా, టూలీ 2020 నుంచి వీసీగా బాధ్యతల్లో ఉన్నారు.

Next Story