Ahmedabad plane crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై UK ప్రధాని దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-12 11:02:53  IST  )

అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదంపై యూకే ప్రధాని కైర్ స్టార్‌మర్‌(UK Prime Minister Keir Starmer) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Ahmedabad plane crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై UK ప్రధాని దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదంపై యూకే ప్రధాని కైర్ స్టార్‌మర్‌(UK Prime Minister Keir Starmer) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా బాధాకరమైన ఘటన అని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, ప్రమాద సమయంలో విమానంలో 240 మందికి పైగా ఉండగా.. 100 మంది వరకు మృతిచెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ విమానం బీజే మెడికల్‌ కాలేజీపై కూలడంతో కాలేజీలో ఉన్న 20 మందికి మెడికోలు మృతిచెందారు. విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు, విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది, 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్‌, ఏడుగురు పోర్చుగల్ వాసులు, ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నారు. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయకచర్యల్లో బీఎస్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నాయి.

Next Story