యూజీసీ నెట్ 2025 ఫలితాలు విడుదల.. 1.88 లక్షలమందికి పైగా ఉత్తీర్ణత

by Phanindra |   (  Updated:2025-07-21 19:13:22  IST  )

యూజీసీ నెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. వీటిలో 1.88 లక్షలమందికి పైగా ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

యూజీసీ నెట్ 2025 ఫలితాలు విడుదల.. 1.88 లక్షలమందికి పైగా ఉత్తీర్ణత
X

దిశ, నేషనల్ బ్యూరో: యూజీసీ నెట్ 2025 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 285 నగరాల్లో ఈ పరీక్షలు జరగ్గా.. దీనికి 10,19,751మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిలో 7,52,007 మంది పరీక్షకు హాజరయ్యారు. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 5,269 మంది, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పీహెచ్‌డీ అడ్మిషన్లకు 54,885మంది, కేవలం పీహెచ్‌డీకి మాత్రమే 1,28,179 మంది.. ఇలా మొత్తంగా 1.88 లక్షల మందికిపైగా క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌), యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత కోసం ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Next Story