Sanjay Raut: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ ది బ్లేమ్ గేమ్- సంజయ్ రౌత్

by Shamantha N |
Sanjay Raut: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ ది బ్లేమ్ గేమ్- సంజయ్ రౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా బ్లాక్, మహా వికాస్ అఘాడీ పొత్తులు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసమే అని అన్నారు. "ఒక కూటమిలో, వ్యక్తిగత పార్టీల కార్యకర్తలకు అవకాశాలు లభించవు. ఇది సంస్థాగత వృద్ధిని దెబ్బతీస్తుంది. మేం ముంబై, థానే, నాగ్‌పూర్ సహా ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీ ఎన్నికల్లో మా బలం ఆధారంగా ఒఒంటరిగానే పోటీ చేస్తాం. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇవే సంకేతాలు ఇచ్చారు." అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఓటమిపై కాంగ్రెస్ బ్లేమ్ గేమ్ ఆడుతోందని అన్నారు. కాంగ్రెస్ నేత విజయ్ వాడేట్టివార్ పై విమర్శలు గుప్పించారు. నమ్మకం లేనివారికి కూటమిలో ఉండే హక్కు లేదన్నారు.

ఇండియా కూటమిపై విమర్శలు

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. "ఇండియా బ్లాక్ కు కనీసం కన్వీనర్ ను కూడా నియమించలేకపోయాం. అది మంచిది కాదు. కూటమిలో అతిపెద్ద పార్టీగా, సమావేశం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ బాధ్యత" అని అన్నారు. ప్రధాని మోడీ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూపైనా రౌత్ స్పందించారు. "మోడీ దేవుడు. నేను ఆయన్ను మనిషిగా పరిగణించను. దేవదూతగా ప్రకటించుకున్న ఆయన మానవుడు ఎలా అవుతాడు? ఆయన విష్ణువు 13వ అవతారం. దేవదూతగా చెప్పుకున్న వ్యక్తి తాను కూడా మనిషినే అని అంటే.. ఏదో తప్పు జరుగుతోంది. కెమికల్ 'లోచ' ఉంది" అని రౌత్ అన్నారు.

Advertisement

Next Story