ఉదయనిధి స్టాలిన్ పై నిప్పులు చెరిగిన ఫైర్ బ్రాండ్ ఉమాభారతి..

by Disha Web Desk 1 |
ఉదయనిధి స్టాలిన్ పై నిప్పులు చెరిగిన ఫైర్ బ్రాండ్ ఉమాభారతి..
X

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సోమవారం ఉదయనిధి స్టాలిన్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉదయనిధికి సనాతన ధర్మంపై ఎటుంవంటి అవగాహన లేదని విమర్శించారు. అతని చేసిన వ్యాఖ్యలకు పెద్దగా తాను ప్రాధాన్యత ఇవ్వబోనని అన్నారు. అతడికి రాజకీయాల్లో పరిపక్వత రాలేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ మెగా యాత్రకు హాజరుకావడానికి ఆహ్వానం అందకపోవడంపై ఆమె స్పందించారు. తాను కేవలం 'పోస్టర్ గర్ల్'గా ఉండకూడదని అనుకుంటున్నానని అన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోదీ కంటే ఇంకా చిన్నదానినని రాబోయే 15 నుంచి 20 ఏళ్ల పాటు ఇంకా పని చేయాలని కోరుకుంటున్నానని తెలిపింది.



Next Story

Most Viewed