- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ucc: గుజరాత్‌లోనూ యూసీసీ.. ముసాయిదా తయారీకి కమిటీ ఏర్పాటు !
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ (Utharakhand) రాష్ట్రంలో ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ (Ucc) అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్రంలోనూ యూసీసీ అమలు చేసేందుకు గుజరాత్ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేయడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా దేశాయ్ (Ranjhana deshay) నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్టు సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు. ఈ కమిటీ తన నివేదికను 45 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తన రిపోర్ట్‌ను అందజేయనుంది. దీని ఆధారంగా ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమలుపై నిర్ణయం తీసుకోనుంది. కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ముస్లిం సమాజం, ఇతర మత పెద్దలను కూడా కలువనున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్ (Bhupendra patel) మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో 75వ స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించేలా యూసీసీ అమలు చేయడమే లక్ష్యమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటికీ నెరవేరుస్తున్నట్టు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One nation one election), ట్రిపుల తలాక్ లపై ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని కొనియాడారు. మోడీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు గుజరాత్ నిరంతరం కృషి చేస్తోందని నొక్కి చెప్పారు. పౌరులందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతోనే యూసీసీని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
కమిటీలోని ఇతర సభ్యుల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి సిఎల్ మీనా, న్యాయవాది ఆర్‌సీ కోడేకర్, విద్యావేత్త దక్షేష్ ఠాకర్, సామాజిక కార్యకర్త గీతా ష్రాఫ్ ఉన్నారు. కాగా, గత నెల 27 నుంచి ఉత్తరాఖండ్ లో యూసీసీ అములులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఘనత సాధించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది.






