- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > U19 world cup: భారత్ దెబ్బకు అమెరికా చిత్తు చిత్తు.. శుభారంభం చేసిన ఇండియా కుర్రాళ్లు
U19 world cup: భారత్ దెబ్బకు అమెరికా చిత్తు చిత్తు.. శుభారంభం చేసిన ఇండియా కుర్రాళ్లు
by Prasad Jukanti |
అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్‍లో టీమిండియా బోణీ కొట్టింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇవాళ్టి నుంచి ప్రారంభమైన అండర్ -19 క్రికెట్ ప్రపంచకప్‍లో (Under 19 World Cup) భారత్ (India) శుభారంభం చేసింది. బులవాయో వేదికగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో గురువారం అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. యూఎస్ఏపై (USA) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ వేట షురూ చేశారు. అభిజ్ఞాన్ (42*) టాప్ స్కోరర్. టాస్ ఓడిన అమెరికా తొలుత బ్యాటింగ్ చేసి భారత బౌలర్ల ధాటికి 107 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ లక్ష్యఛేదనకు దిగగా వర్షం ఆటంకం కలిగించింది. దీంతో డీఎల్‌ఎస్ ప్రకారం మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించి, 96 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా అలవోకగా 17.2 ఓవర్లలోనే ఛేదించింది.
Next Story






