బ్రేకింగ్: కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా యూటీ ఖదీర్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా యూటీ ఖదీర్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత యూటీ ఖదీర్ ఎంపికయ్యారు. దక్షిణ కన్నడ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యూటీ ఖదీర్‌కు కాంగ్రెస్ ఈ దఫా అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశం కల్పించింది. కాగా, దక్షిణ కన్నడ నుండి సీనియర్ నేత అయిన యూటీ ఖదీర్ గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగాను పని చేశారు. ఇక, కర్నాటక అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.

ఇటీవల ఎంపికైన నూతన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. కాగా, ఈ నెల 10వ తేదీన జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా.. సీనియర్ నేత సిద్ధరామయ్య సీఎంగా రెండవ సారి బాధ్యతలు చేపట్టగా.. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

Read More: అర్ధరాత్రి లారీలో రాహుల్ గాంధీ జర్నీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Next Story

Most Viewed