- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనాలో తుఫాను బీభత్సం.. 400 భవనాలు ధ్వంసం
చైనా(China)లో టైఫూన్ విఫా (Typhoon Wipha) బీభత్సం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : చైనా(China)లో టైఫూన్ విఫా (Typhoon Wipha) బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ చైనా తీరంలోని హైనాన్ ద్వీపం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. గంటకు 140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీశాయి. భారీ వర్షాలతో 400కు పైగా భవనాలు దెబ్బతిన్నాయి. 400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఇక హాంకాంగ్‌లో T10 ప్రమాద హెచ్చరిక సిగ్నల్ జారీ చేశారు. మకావు, షెన్‌జెన్‌లో కూడా టైఫూన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫిలిప్పీన్స్‌లో 370,000 మందిపై టైఫూన్ ప్రభావం పడింది. దాదాపు 43,000 మంది ఇళ్ళు ఖాళీ చేశారు.
హైనాన్‌లో 8,30,000 గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్వాంగ్‌డాంగ్‌లో 5,74,500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. ఈ టైఫూన్ కారణంగా విమానాలు, రైళ్లు, ఫెర్రీలను నిలిపివేశారు. పాఠశాలలు, అన్ని రకాల వ్యాపారాలను మూసివేసి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే టైఫూన్ విఫా వియత్నాంకు కూడా చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.






