- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్‌లోనే సిగలు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. ఎందుకంటే?
నవీ ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు మహిళలు సిగలు పట్టుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నవీ ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు మహిళలు సిగలు పట్టుకున్నారు. పోలీసుల కళ్ల ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవకు దిగిన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 26న పన్వేల్ పట్టణానికి చెందిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 160 (ఎఫైర్‌కు పాల్పడడం) కింద కేసు నమోదు చేసినట్లు అధికారి వెల్లడించారు.
నిందితుల్లో ఒక మహిళ మే 14న మరో మహిళపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ విషయం తెలిసిన మరో మహిళ కూడా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. మొదటి మహిళతో వాగ్వాదానికి దిగింది. ఇద్దరూ ఆ పోలీస్‌స్టేషన్లోనే ఒకరినొకరు దూషించుకున్నారు. ఆ తరువాత కొట్టుకున్నారు. ఇదంతా చూస్తున్న పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా.. చివరికి శాంతించారు. దీంతో, ఆ ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. కానీ, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారి తెలిపారు.






