- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యారేజ్ బ్యూరో పేరుతో శిశువుల అక్రమ రవాణా.. కోట్లలో దందా..
యూపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మ్యారేజ్ బ్యూరో పేరుతో శిశువుల అక్రమ రవాణా చేస్తున్న ముఠా చిక్కింది. ముజఫ్ఫర్ నగర్, షామ్లీలో మ్యారేజ్ బ్యూరోలు నడుపుతున్నారు స్వాతి, సంధ్యా చౌహాన్. సాధారణంగా ఇక్కడ మ్యాచ్‌లు సెట్ చేయాలి కానీ

దిశ, వెబ్ డెస్క్ : యూపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మ్యారేజ్ బ్యూరో పేరుతో శిశువుల అక్రమ రవాణా చేస్తున్న ముఠా చిక్కింది. ముజఫ్ఫర్ నగర్, షామ్లీలో మ్యారేజ్ బ్యూరోలు నడుపుతున్నారు స్వాతి, సంధ్యా చౌహాన్. సాధారణంగా ఇక్కడ మ్యాచ్‌లు సెట్ చేయాలి కానీ పిల్లలను అమ్ముతున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు నవీద్ అన్సారీ, అఫ్సర్.. నర్సులు, ఏఎన్ఎంల సహాయంతో ఈ వ్యాపారం నడుపుతున్నారు.
అప్పుడే పుట్టిన పిల్లలను అపహరించే ముఠా.. తమ దగ్గర ఉన్న పిల్లల సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సంతానం లేని దంపతులకు చేరవేస్తుంది. శిశువులను చూజ్ చేసుకోగానే.. బేరాలు ఆడుతారు. ఫెయిర్ స్కిన్ ఉన్న పిల్లలకు ఏకంగా ఐదు లక్షలకు అమ్ముతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్, నేపాల్ వరకు సంబంధాలు ఉండగా.. మూడేళ్లుగా సాగుతున్న వ్యాపారం ట్రోనికా నుంచి ఏడాది బాలుడు కిడ్నాప్ కావడంతో వెలుగులోకి వచ్చింది. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఈ కథ.. రీసెంట్‌గా వచ్చిన డీఎన్ఏ మూవీతో పోలి ఉండగా.. నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.






