UAE: యూఏఈలో ఇద్దరు కేరళవాసులకు మరణశిక్ష అమలు

by Shamantha N |

ఇద్దరు కేరళవాసులకు యూఏఈలో మరణశిక్ష పడింది. హత్యలకు పాల్పడ్డారంటూ ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షను అమలు చేశారు.

UAE: యూఏఈలో ఇద్దరు కేరళవాసులకు మరణశిక్ష అమలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇద్దరు కేరళవాసులకు యూఏఈలో మరణశిక్ష పడింది. హత్యలకు పాల్పడ్డారంటూ ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని భారతవిదేశాంగశాఖ గురువారం వెల్లడించింది. ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసింది. కాగా.. శిక్షకు గురైన వారిని మహమ్మద్‌ రినాష్‌ అరింగిలొట్టు, మురళీధరన్‌ పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు. యూఏఈ వాసి హత్య కేసులో మహమ్మద్‌ రినాష్‌ దోషిగా తేలగా.. తోటి భారతీయుడిని చంపినన కేసులో మురళీధరన్‌కు శిక్షపడింది.

అన్ని రకాల సాయం చేసిన విదేశాంగ శాఖ

ఫిబ్రవరి 28న ఉరిశిక్షల గురించి భారత రాయబార కార్యాలయానికి యూఏఈ తెలియజేసింది. యూఏఈ ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటిషన్లు, అభ్యర్థనలను పంపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వీరిద్దరికి అవసరమైన దౌత్య,న్యాయ సాయం అందజేసినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. మరోవైపు, యూఏఈ జైల్లో భారతీయ మహిళ షెహజాది ఖాన్‌కు ఉరిశిక్షను అమలు చేసిన విషయం రెండ్రోజుల క్రితమే తెలిసింది. దాదాపు ఏడాది పాటు ఆమె న్యాయపోరాటం చేసినా ఫలితం లభించలేదు. ఫిబ్రవరి 15న ఆమెను ఉరి తీయగా.. ఆ సమాచారం ఆలస్యంగా వారి కుటుంబ సభ్యులకు చేరింది.

Next Story