ఉగ్రవాదులతో సంబంధాలు.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

by Yella Dhawani Reddy |

పాక్ ఉగ్రవాదుల కోసం గూఢచార్య చేస్తున్న వారిపై భారత అధికారులు గత కొన్ని రోజులు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఉగ్రవాదులతో సంబంధాలు.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
X

దిశ, వెబ్ డెస్క్: పాక్ ఉగ్రవాదుల కోసం గూఢచార్య చేస్తున్న వారిపై భారత అధికారులు గత కొన్ని రోజులు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురు ప్రభుత్వ అధికారులు, సామాన్య పౌరులపై ఉక్కుపాదం మోపారు. ఇక తాజాగా మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను (Government Employees) ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై విధుల నుంచి జమ్ము కశ్మీర్‌ (Jammu Kashmir) ప్రభుత్వం తొలగించింది. వీరిలో ఒకరు, ఖుర్షీద్ అహ్మద్ రాథర్, కుప్వారా జిల్లా కర్నాలో టీచర్‌గా పనిచేస్తున్నారు. మరొకరు, సియాద్ అహ్మద్ ఖాన్, కుప్వారా జిల్లా కేరన్ ప్రాంతంలోని గొర్రెల పరిశ్రమ విభాగంలో అసిస్టెంట్ స్టాక్‌మెన్‌గా సేవలందిస్తున్నారు. అధికారిక వర్గాల ప్రకారం ఈ ఇద్దరూ నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా (Lashkar-e-Taiba) తరఫున పనిచేస్తూ ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇచ్చారు. భద్రతా సంస్థలు, గూఢచార వర్గాలు వీరి చర్యలపై సుదీర్ఘంగా పరిశీలన జరిపి, పటిష్ఠమైన ఆధారాలు సేకరించాయి. వీరి సంబంధాలు స్పష్టమైన తర్వాత, చట్టం ప్రకారం చర్యలు తీసుకొని, ప్రభుత్వ సేవల నుంచి తొలగించారు.

Next Story