కూలిన నాలుగు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

by Naga Rani Yarlagadda |

ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు.

కూలిన నాలుగు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిర్మాణం గ్రౌండ్ ప్లస్ మూడంతస్తుల భవనం అని, ఉదయం 7.05 గంటల ప్రాంతంలో కూలిపోయినట్లు సమాచారం అందింది. వెంటనే 7 అగ్నిమాపక వాహనాలతో 42 మంది అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనలో నలుగురిని రక్షించి ఆస్పత్రికి తరలించగా.. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిథిలాలను తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, పౌర రక్షణ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున సెంట్రల్ ఢిల్లీలోని బారా హిందూరావు ప్రాంతంలో మూడంతస్తుల వాణిజ్య భవనం కూలి 46 ఏళ్ల మనోజ్ శర్మ అనే వ్యక్తి మరణించాడు. జనక్‌పురి వెస్ట్-ఆర్‌కె ఆశ్రమ మార్గ్ కారిడార్ కోసం సొరంగం పనులు జరుగుతున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC), శర్మ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Next Story