- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Syria: సిరియా అల్లకల్లోలం.. ఎక్కడ చూసినా మృతదేహాలే
అంతర్యుద్ధంతో సిరియా అట్టడుకుతోంది. మాజీ అధ్యక్షుడు బషర్ అస్సాద్ అనుకూల వర్గాలు, సెక్యూరిటీ బలగాల మధ్య ఘర్షణతో సిరియా అట్టడుకుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్యుద్ధంతో సిరియా అట్టడుకుతోంది. మాజీ అధ్యక్షుడు బషర్ అస్సాద్ అనుకూల వర్గాలు, సెక్యూరిటీ బలగాల మధ్య ఘర్షణతో సిరియా అట్టడుకుతోంది. రెండ్రోజులుగా జరిగిన ఘర్షణలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు. వీరిలో 745 మంది పౌరులు.. 125 మంది ప్రభుత్వ భద్రతా దళ సభ్యులు, 148 మంది అసద్ మద్దతు దారులు ఉన్నారు. పద్నాలుగేళ్ల క్రితం సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభం కాగా.. అప్పట్నుంచి ఇదే అత్యంత దారుణ ఘటన. వీధుల్లో, ఇళ్లలో ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. వాటిని తీసేందుకు భయంతో ఎవ్వరూ కూడా బయటకు రావడం లేదు. లటాకియా నగరం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతాలలో విద్యుత్, తాగునీరు నిలిపివేశారు.
అసద్ పారిపోయినప్పట్నుంచి గొడవ
మాజీ అధ్యక్షుడు అసద్ అధికారం నుంచి వైదొలిగిన తర్వాత దేశాన్ని విడిచి రష్యాకు పారిపోయారు. కాగా.. తిరుగుబాటు దారులు డమాస్కస్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. గురువారం అసద్ మద్దతుదారులు జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హతమార్చాయి. అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే వారి నివాసాలకు నిప్పంటించాయి. దీంతో, ఘర్షణలు ముదిరిపోయాయి. ఇక, దాడుల్లో మృతి చెందిన ఐదుగురు సిరియన్ దళాలకు శనివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. దీనికి అనేక మంది ప్రజలు హాజరయ్యారు. మరోవైపు, సిరియా హింసపై ఫ్రాన్స్ తీవ్ర ఆందోళవ వ్యక్తం చేసింది. మతప్రాతిపదికన పౌరులపై, ఖైదీలపై జరిగిన దారుణాలను ఖండిస్తున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ పేర్కొంది.






