కుప్పకూలిన రెండు భవనాలు.. ఏకంగా 19 మంది దుర్మరణం

by Kema Shiva Kumar |

రెండు భవనాలు కుప్పకూలి ఏకంగా 19 మంది దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కుప్పకూలిన రెండు భవనాలు.. ఏకంగా 19 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు భవనాలు కుప్పకూలి ఏకంగా 19 మంది దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొరాకో (Morocco)లోని ఫెస్ (Fes) నగరంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మసీరా-జౌఘా (Masirah-Jawgha) జిల్లా అల్ ముస్తఖ్బల్‌ (Al Mustaqbal)లో నాలుగు అంతస్తుల జంట భవనాలు మంగళవారం అర్ధరాత్రి కుప్పకూలాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 19 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా, కుప్పకూలిన జంట భవనాల్లో మొత్తం ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు భద్రతా బృందాలు, అగ్నిమాపక దళాలు స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫెస్ యూనివర్సిటీ ఆసుపత్రి (Fes University Hospital)కి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉండవచ్చనే అనుమానంతో స్పాట్‌లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అయితే, భవనాలు కూలిన ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Next Story