అది ఏఐ వీడియో: టీవీకేపై దినకరన్‌ ఆరోపణలు

by Naga Rani Yarlagadda |

తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. విజయ్ కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల అంశం గంటకో మలుపు తిరుగుతోంది.

అది ఏఐ వీడియో: టీవీకేపై దినకరన్‌ ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న టీవీకేకు ఏఎంఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దతిచ్చారని వార్తలు రాగా.. అదంతా ఫేక్ అని ఆ పార్టీ చీఫ్ దినకరన్ ఆరోపించారు. ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నారు. దీనిపై స్పందించిన టీవీకే.. ఎమ్మెల్యే సంతకం చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియో బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా ఈ అంశంపై స్పందించిన దినకరన్.. మొత్తం వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యే మద్దతు వ్యవహారంలో నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉందని, రాజకీయ లాభం కోసం ఎవరూ ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే మద్దతు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీయగా.. రానున్న రోజుల్లో ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు.. విజయ్ ఇంకా ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు కావలసి ఉంది. ఈ క్రమంలో వీసీకే పార్టీ విజయ్ ముందుంచిన డిమాండ్లపై చర్చ జరుగుతోంది. ఇరు పార్టీలకు డిమాండ్లపై క్లారిటీ వచ్చాక విజయ్ కు మద్దతిచ్చే విషయంపై వీసీకే అధికారిక ప్రకటన చేయనుంది. ఆ పార్టీ అంగీకరిస్తే.. విజయ్ ప్రమాణ స్వీకారమే తరువాయి.

Next Story