Bengaluru: బెంగళూరు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ దాడి కేసులో ట్విస్ట్

by Shamantha N |

బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌పై దాడి జరిగిన కేసులో ట్విస్ట్ ఎదురయ్యింది. బెంగళూరులో తమపై కొందరు దాడి చేశారని వింగ్‌ కమాండర్‌ షీలాదిత్యా బోస్‌, ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆరోపించారు.

Bengaluru: బెంగళూరు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ దాడి కేసులో ట్విస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌పై దాడి జరిగిన కేసులో ట్విస్ట్ ఎదురయ్యింది. బెంగళూరులో తమపై కొందరు దాడి చేశారని వింగ్‌ కమాండర్‌ షీలాదిత్యా బోస్‌, ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆరోపించారు. అయితే.. తొలుత బోస్‌ దాడికి దిగినట్లుగా కన్పిస్తున్న సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని పోలీసులు వర్గాలు ధ్రవీకరించాయి. సీసీటీవీ విజువల్స్ లో ఫుట్‌పాత్‌పై నిల్చొని ఉన్న నిందితుడు వికాస్‌ కుమార్‌పై తొలుత బోస్‌ దాడి చేసినట్లుగా కనిపిస్తోంది. ఆయన్ను ఆపేందుకు వచ్చిన వారిపై కూడా దాడికి పాల్పడినట్లు రికార్డయ్యింది. అయితే, ఈ దాడి కేవలం వింగ్‌ కమాండర్‌ లక్ష్యంగా చేసిన దాడి కాదని, పరస్పరం జరిగిన దాడిగా పోలీసు అధికారి ఒకరు నిర్ధరించారు. ఈ గొడవకు గల కారణమేమిటన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదన్నారు.

డీసీపీ ఏమన్నారంటే?

ఈ ఘటనపై బెంగళూరు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దేవరాజ్‌ స్పందించారు. ఇది ఏకపక్షంగా జరిగిన దాడి కాదని.. ఇది ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ‘కన్నడిగ వర్సెస్‌ నాన్‌ కన్నడిగ’గా మారింది. అయితే వీడియో ఆధారంగా విచారణ జరిపిన ఈస్ట్‌ జోన్‌ డీసీపీ దేవ్‌రాజ్‌ షాకింగ్‌ విషయం తెలియజేశారు. తొలుత బోస్‌ వాళ్లపై దాడికి దిగారని తెలియజేశారు. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు కూడా బోస్‌పై ఫిర్యాదు చేశారని అన్నారు. కమాండర్ ముఖం రక్తస్రావం కావడంతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారన్నారు. తొలుత ప్రాథమిక చికిత్స అందించామని.. ఆ తరవాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమంటే ఫ్లైట్‌కి టైమ్‌ అవుతుందని వెళ్లిపోయారన్నారు. బోస్‌ వీడియో విడుదల చేశాక.. ఆయన భార్య మధుమిత వివరాలు కనుగొని ఆమెను సంప్రదించామన్నారు. తర్వాత ఆమె స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దీనిపై పోలీసులు బోస్‌ను త్వరలోనే విచారించనున్నారు.

Next Story