"నా హృదయం ముక్కలైంది.. ఆ బాధను వర్ణించలేను" : తొక్కిసలాట ఘటనపై విజయ్ ఫస్ట్ రియాక్షన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-28 13:13:16  IST  )

తమిళనాడులోని కరూర్ లో శనివారం సాయంత్రం.. టీవీకే పార్టీ అధినేత విజయ్ (TVK Vijay) నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు.

నా హృదయం ముక్కలైంది.. ఆ బాధను వర్ణించలేను : తొక్కిసలాట ఘటనపై విజయ్ ఫస్ట్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కరూర్ లో శనివారం సాయంత్రం.. టీవీకే పార్టీ అధినేత విజయ్ (TVK Vijay) నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. ఈ ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఎక్స్ (X) వేదికగా స్పందించారు. తొక్కిసలాటలో 39 మంది మరణించడం తనను చాలా బాధించిందన్నారు. ఈ ఘటనను చూసి తన హృదయం ముక్కలైందని, భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నానని వెల్లడించారు. తన బాధను పదాల్లో వర్ణించలేనని పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాటలో (Karur Stempede) ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదర, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆ పోస్టులో రాశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాగా.. నేడు కరూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మరణించినవారి కుటుంబ సభ్యుల్ని సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) పరామర్శించనున్నారు.

Next Story