- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tumulpad: నక్సల్ ప్రభావిత గ్రామంలో పతాక ఆవిష్కరణ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఉన్న నక్సల్స్ ప్రభావిత గ్రామం తూములపాడ్‌లో తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ (Chathisgarh)లోని సుక్మా జిల్లాలో ఉన్న నక్సల్స్ ప్రభావిత గ్రామం తూములపాడ్ (Tumulpad)లో తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్రానంతరం గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించడం ఇదే మొదటి సారి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 74వ బెటాలియన్ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. చిన్నారులు, వృద్ధులతో సహా గ్రామస్తులు భారత్ మాతాకీ జై అని నినాదాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ హిమాన్షు పాండే గ్రామస్తులకు రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను వివరించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం భద్రతా దళ సిబ్బంది గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. కాగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తూములపాడు ఒకటి. దీంతో స్వాత్రంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ గ్రామంలో పతాకాన్ని ఆవిష్కరించలేదు. అయితే ఈ ప్రాంతాల్లో కొత్త పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల మార్పు వచ్చినట్టు అధికారులు భావిస్తు్న్నారు.






