- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russia: రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం (ఈఎంఎస్‌సీ) వద్ద రెండవ భూకంపం 7.4 తీవ్రతతో నమోదైందని జీఎఫ్‌జెడ్ పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాకు తూర్పున ఉన్న కమ్చట్కా ప్రాంతం తీరానికి సమీపంలో ఆదివారం 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) తెలిపింది. భూకంపం 10 కి.మీ లోతులో సంభవించిందని జీఎఫ్‌జెడ్ వెల్లడించింది. మొదట వచ్చిన భూకంపం కమ్చట్కా తూర్పు తీరంలో 10 కి.మీ లోతులో 6.7 తీవ్రతతో వచ్చింది. ఆ తర్వాత యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం (ఈఎంఎస్‌సీ) వద్ద రెండవ భూకంపం 7.4 తీవ్రతతో నమోదైందని జీఎఫ్‌జెడ్ పేర్కొంది. దీంతో కంచట్కా ద్వీపకల్పంతో పాటు హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భూకంప కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పున 144 కి.మీ. దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో ఉన్నట్టు గుర్తించారు. దీనికి ముందు సుమారు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో 5 భూకంపాలు నమోదయ్యాయి. వాటిలో 7.4 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) హెచ్చరించింది. మొదట్లో పెద్ద సునామీ అలల ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ, ఆ తరువాత చివరికి ప్రమాదం దాటిపోయిందని వెల్లడించారు.






