- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నిజం ఎప్పుడూ తలవంచదు’.. చెన్నైలో కమల్ హసన్ కు మద్దతుగా పోస్టర్లు
తమిళనాడు లో కమల్ హాసన్‌కు మద్దతుగా పోస్టర్లు, ‘Thug Life’పై నిరసనలు కొనసాగుతున్న కర్ణాటక తమిళ భాష నుంచే కన్నడం పుట్టిందని థగ్ లైఫ్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా తమిళనాడులో ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యం తరఫున చెన్నైలో భారీగా పోస్టర్లు వెలిశాయి.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని థగ్ లైఫ్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యం తరఫున చెన్నైలో భారీగా పోస్టర్లు వెలిశాయి. ఇందులో ప్రపంచానికి తెలిసిన నిజమే కమల్ చెప్పాడు. నిజం ఎప్పుడూ తలవంచదు. ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. రెండు భాషల మధ్య సంబంధాన్నే ఆయన చెప్పారని పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే కమల్ హసన్ నటించిన థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో నిషేధించాలని ప్రో కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కొనసాగుతున్న వివాదం
చెన్నైలో ప్రముఖ ప్రదేశాలలో మక్కల్ నీది మయ్యం ఏర్పాటు చేసిన పోస్టర్లలో కమల్ హాసన్ వ్యాఖ్యలను సమర్థించే నినాదాలు కనిపిస్తున్నాయి.ఈ వివాదం నేపథ్యంలో కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 'Thug Life' సినిమా రిలీజ్‌పై నిషేధం విధిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నటుడు కమల్ హాసన్, ప్రముఖ పంపిణీదారుడు రాక్‌లైన్ వెంకటేశ్‌ను కలవనున్నారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పేలా ఒప్పించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఆగిపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. కమల్ హాసన్ మాత్రం తాను తప్పు చేయలేదని, చేసినప్పుడే క్షమాపణ చెబుతానని ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, సినిమాకు భద్రతతో పాటు విడుదలకు అనుమతించాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. జూన్ 5న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ప్రస్తుతం కర్ణాటకలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా విడుదల అవుతుందా కాదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది.






